INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Mahendragiri: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. బరాక్-8, బ్రహ్మోస్ క్షిపణులతో పాటు అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ నౌక భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం, జలాంతర్గాములను గుర్తించి నిర్వీర్యం చేసే వ్యవస్థలు దీనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, అధునాతన నౌకా నిర్మాణ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. యుద్ధం కంటే ప్రపంచ శాంతికే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని, అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన సమాధానం ఇవ్వడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు.
మారిటైమ్ విజన్–2030, మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా నౌకా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు రాజ్‌నాథ్… ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి సముద్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి, భారతదేశాన్ని షిప్‌బిల్డింగ్, ఆవిష్కరణల రంగంలో అగ్రగామిగా నిలపడం లక్ష్యమని వివరించారు. ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి గా చేరిందన్న ఆయన.. సముద్ర రక్షణ లో విశాఖపట్నం ఒక బలమైన శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆలోచనలతో ఏరో స్పేస్ రంగం అభివృద్ధి అవుతోంది.. ఫిఫ్త్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ టెక్నాలజీ అండర్ వాటర్ టార్పోడో అభివృద్ధి చేస్తున్నాం… కర్నూలు డ్రోన్ హబ్ అవుతుంది. ఆర్టిఫిషీయల్ ఇంటెల్ జెంట్స్ , న్యూ టెక్నాలజీ , అడ్వాన్స్ షిప్ తీసుకొస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ తో, ఫుల్ సర్వ్ లెన్స్ తో సరికొత్త ఆధునిక యుద్ధ శక్తి తో ముందుకు వెళ్తున్నాం.. కొత్త పరిజ్ఞానం యుద్ధానికి మాత్రమే కాదు ఒకోసారి మరో దేశానికి సహకారంగా కూడా నిలుస్తాం అన్నారు.. యుద్ధం మా నినాదం కాదు .. శాంతి, సర్వ ప్రపంచ శాంతి మా విధానం. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు.. మన స్థిరత్వాన్ని బద్దలు కొడితే జరిగే పరిణామం చూపించాం అన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
Also Read
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!