CM Revanth Reddy: ఐఐహెచ్‌టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. అధికారులకు సీఎం ఆదేశాలు..
- ఐఐహెచ్‌టీ (IIHT)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు..
- ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఐఐహెచ్‌టీ (IIHT)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించామని.. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నాంపల్లి లలిత కళాతోరణంలో ‘చేనేత అభయహస్తం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. అదేవిధంగా ఐఐహెచ్‌టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులు IIHTలో చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి అన్నారు. తెలంగాణలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు పదేళ్లుగా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసామన్నారు.
Read also: Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌కు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్!
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ సంవత్సరమే ఇనిస్టిట్యూట్ మొదలుపెట్టాలని మేం అధికారులను ఆదేశించామన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసామన్నారు. వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో IIHT భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నేత కార్మికుల కళ్లలో ఆనందం చూడాలని రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసామన్నారు. గతంలో ఆర్భాటం,సినీ తారల తతళుకు బెళుకులు తప్ప.. నేతన్న ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసిందన్నారు. కానీ మేం బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి.. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నామన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారన్నారు.
Read also: Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..
ఏడాదికి ఒక్కో సభ్యురాలికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మంచి డిజైన్, క్వాలిటీ తో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇవ్వనున్నామన్నారు. సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. రూ.30కోట్లున్న చేనేత రుణాలు మాఫీ చేసి చేనేత కార్మికుల రుణ విముక్తులను చేస్తామన్నారు. రైతన్న ఎంత ముఖ్యమో మాకు నేతన్న కూడా అంతే ముఖ్యమన్నారు. మీ సమస్యల పరిష్కారానికి మీ అన్నగా మీకు అండగా ఉంటామన్నారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదన్నారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా లక్ష్మణ్ బాపూజీది అసలు సిసలైన త్యాగం అన్నారు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ.. IIHT కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు.
Heavy Rain Alert for AP: కాసేపట్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!