Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భారత్ వైపు కదులుతోంది. దిట్వా తుఫాను ముంచుకొస్తుండటంతో తమిళనాడు హై అలర్ట్ అయింది. తుఫాన్ శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని అనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుఫానుకు యెమెన్ దేశం దిట్వా తుఫానుగా పేరు పెట్టింది. Read Also: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు.. మొదటగా ఎక్కడ…
Montha Cyclone: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది..
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరీ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
Cyclone Midhili: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత బంగ్లాదేశ్ లో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. బలమైన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, ఇది తుఫానుగా మారిన తర్వాత ‘మిధిలీ’గా పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ పేరున మాల్దీవులు సూచించింది. మిధిలీ తుఫాన్ శనివారం ఉదయం బంగ్లాదేశ్ లోని ఖేపుపరా, మోంగ్లా…
Hamoon Cyclone: తూర్పు తీరానికి తుఫాన్ ప్రమాదం పొంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, శ్రీలంక తీరప్రాంతం సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనంతో పాటు బంగాళాఖాతంలో నవంబర్ 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం మరో 3-4 రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ…