భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే ఒడిశాలోని పూరీ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. భూ ఉపరితలంపై అదే తీవ్రతతో ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. ఇక, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు.. మరోవైపు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.. మరోవైపు.. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని…
మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే.. వారిని తీసివేస్తానంటూ హెచ్చరించారు.. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు.. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారినీ తీసేస్తా... పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.