జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. నేడు రుషికొండను విజిట్ చేయనున్నారు. అయితే పవన్ సందర్శన సందర్భంగా.. రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు దాటకుని ఋషికొండ వెళ్లి తీరతామని జనసేన నేతలు అంటున్నారు. నిషేధిత ప్రాంతం కానప్పుడు ఎందుకు అడ్డుకుంటారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Indian Railways: అలా చేస్తే.. రైల్వేకు రోజుకు రెండు లక్షల లీటర్ల డీజిల్ ఆదా
నోవాటల్ హోటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయల్దేరి వెళ్లారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. ఋషికొండకు వెళ్లే మార్గాలు పోలీసులు మూసివేశారు. రుషికొండ పర్యటనకు అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ నియంత్రణ కోసం పోలీసులు సన్నద్ధం అయ్యారు. దీంతో రుషికొండ మొత్తం హైసెక్యూరిటీ జోన్ గా మారింది. మరోవైపు ఆంక్షలను ఉల్లంఘించయిన రుషికొండ వెళతామని జనసేన అంటోంది. ఆ ప్రాంతం నిషేధిత ప్రాతం కానందున ఆంక్షలు ఎందుకో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే జనసేన నాయకులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. వాహనాల సంఖ్య పరిమితంగా ఉండాలని సూచిస్తున్నారు.
China Real Estate: చైనాలో ద్రవ్యోల్బణం.. 6 నెలల్లో ఒక్క సంస్థ రూ. 57వేల కోట్ల నష్టం
మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా నిన్న జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. దీంతో విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. జనసేనకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై ఆ పార్టీ స్పందించింది. ఎన్ని ఆంక్షలు పెట్టిన వారాహి యాత్రలో వెనక్కి తగ్గబోమని అంటోంది.