Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని మళ్లీ కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల మరో పిటిషన్
- వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్..
- వంశీని 3 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు..
- నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కస్టడీ కోసం నూజివీడు కోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: వైఎస్సార్ కాంగ్రెస పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నూజివీడు కోర్టు.. మరోవైపు.. వల్లభనేని వంశీనీ రెండోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు తాజాగా పిటిషన్ వేశారు.. ఇప్పటికే ఇదే కేసులో రెండు రోజుల పాటు వల్లభనేని వంశీని న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.. అయితే, వంశీ సరిగా విచారణకు సహకరించక పోవటంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు.. అయితే, పోలీసుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నూజివీడు కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది..
Read Also: Andhra Pradesh: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు.. శుభకార్యానికి వెళ్లి..!
Also Read
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
కాగా, ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందారు వల్లభనేని వంశీ.. కానీ, చివరల్లో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కోర్టు వల్లభనేని వంశీపై పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వడంతో కథ అడ్డం దిరిగింది.. ఇక, నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు.. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుండగా.. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు.. మరోవైపు.. ఈ విషయం తెలుసుకుని జీజీహెచ్‌కు చేరుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని.. వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు.. దీంతో, ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే.. మరోవైపు.. నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వంశీ మోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నూజివీడు కోర్టు… నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. వంశీ ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!