Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు విధించిన షరతులను కొనసాగిస్తూ ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో నాగరాజును విచారించడం దర్యాప్తుకు ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొంటూ, విజయవాడలోని సిట్ కార్యాలయంలో కస్టడీ విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో పురోగతి కోసం విజయవాడలో విచారణ అవసరమని సిట్ తన పిటిషన్లో వివరించింది.
సిట్ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే హైకోర్టు గతంలో విధించిన ఇతర అన్ని షరతులు యథావిధిగా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విజయవాడలో సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణతో కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!