Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని 2025 మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కేవలం డీఎస్సీ నియామకాల కోసమే ఉపయోగించుకున్నారని, మొత్తం నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎస్సీఆర్టీ కన్వీనర్కే డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే వ్యవస్థ చేతిలో జరిగాయని ఆయన అన్నారు. గోప్యంగా ఉండాల్సిన పరీక్షల ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించారని, ప్రశ్నపత్రాల తయారీ నుంచి మార్కుల అప్లోడింగ్ వరకు ఒకే బృందం పని చేసిందని ఆరోపించారు.
ఎస్సీఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు తొలుత కృష్ణా జిల్లా టాప్ ర్యాంక్ వచ్చిందని, మొదటి మెరిట్ లిస్ట్‌లో టాపర్‌గా ఉన్న అతని పేరును తర్వాత తొలగించి రెండో మెరిట్ లిస్ట్‌లో మరో అభ్యర్థిని టాపర్‌గా ప్రకటించారని పేర్ని నాని పేర్కొన్నారు. రెండు మెరిట్ లిస్టులు ఎందుకు విడుదల చేశారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ మెరిట్ లిస్టును కలెక్టరేట్లో ప్రదర్శించకుండా కేవలం ఆన్లైన్లో మాత్రమే ఎందుకు విడుదల చేశారని కూడా ఆయన ప్రశ్నించారు. నవీన్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక, డీఎస్సీ పేపర్ లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని, నియామకాలపై బహిరంగ చర్చకు రావాలని పేర్ని నాని సవాల్ విసిరారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని పలుమార్లు చెప్పినా మంత్రి నారా లోకేష్ స్పందించడం లేదని విమర్శించారు.
Also Read
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!