Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ – టుడేస్ వర్క్‌షాప్’లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యాలు చేశారు.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని, వివిధ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ’ వర్క్‌షాప్ పోలీసు వ్యవస్థకు ఎంతో కీలకమని ఆమె అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను 4 శాతం మేర తగ్గించగలిగామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో గంజాయి సాగుపై సమర్థవంతంగా నియంత్రణ సాధించామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడని పేర్కొన్న అనిత.. 2028 నాటికి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటారని అన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అభిప్రాయాలను వినే నాయకత్వం ఆయనదని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో అనేక మంది పోలీసు అధికారులతో కలిసి పనిచేసిన అనుభవం సీఎం చంద్రబాబుకు ఉందని తెలిపారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సవాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసులు చేసే దర్యాప్తు కంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు సోషల్ మీడియాలో చేసే చర్చలు, విచారణలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు చేయడం, అసత్య ప్రచారం చేయడం వంటి అంశాలపై పోలీసులు మరింత దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని తెలిపారు. వర్క్‌షాప్‌లో పాల్గొంటున్న అధికారులు తమ సలహాలు, సూచనలను నేరుగా ముఖ్యమంత్రికి అందించాలని హోంమంత్రి అనిత కోరారు. దీంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!