Taneti Vanita: వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా
విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన మొదటి సీఎం వైఎస్ఆర్ అని హోంమంత్రి కొనియాడారు. మహిళా సాధికారత సాధించేలా సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ శాసనసభ్యులను అందరిని గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Kidney Stones: కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన చిట్కాలు..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే లేవని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైద్యం, విద్య ఆ రోజుల్లో ఖరీదుగా ఉండేవని.. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచితంగా విద్య, వైద్య అందించిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.
గుండె ఆపరేషన్ల ద్వారా ఎంతోమందికి ప్రాణం పోసిన మహానేత వైఎస్ అని మంత్రి తెలిపారు. వైఎస్ ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గర్వం ప్రదర్శించలేదని.. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ ఎక్కడా గర్వం చూపించరని పేర్కొన్నారు.
పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే జగన్ లక్ష్యమన్నారు.
Read Also: BAN vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తప్పక గెలవాల్సిందే!
జగనన్న మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇళ్లిస్తామని ఉంటే ఇప్పటిదాకా 32 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్ధలాలిచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఆర్థిక పరిస్ధితులను తట్టుకుని జగన్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ తన సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని.. మరి ఆనాడు అదే బడ్జెట్ తో టీడీపీ ఎందుకు ఇవ్వలేకపోయిందని మంత్రి ప్రశ్నించారు. అంటే ఆనాడు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి పేదల డబ్బులు అనేది సమాధానం చెప్పాలని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
-
SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!