వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి..
చంద్రబాబు సీఎం, ఎంపీ నాని, పారిపోయిన జలీల్ ఖాన్, దద్దమ్మ దేవినేని ఉమ ఉండి కూడా వన్ ఔన్ అభివృద్ధి కాలేదు అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానించదగినది.. అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
ఏపీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని ఎస్సార్‌పురంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఘటనా స్థలం వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకొని ధర్నా చేపట్టారు. అంతేకాకుండా ఘటనస్థలాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. పోలీసులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహ ధ్వంసానికి…
గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు. Read Also: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు…