Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు మరోసారి ధరల షాక్ తగిలింది. చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో ధరలు గణనీయంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడలో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.298కు చేరువగా ఉంది. డ్రెస్డ్ చికెన్ ధర కిలోకు రూ.264గా ఉండగా, ఫారం వద్ద లైవ్ బర్డ్ ధర రూ.143, రిటైల్ మార్కెట్లో రూ.170 వరకు పలుకుతోంది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర కిలోకు సుమారు రూ.50 వరకు పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
అటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.100కు చేరుకోవడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు మరింత పెరిగాయి. నాన్‌వెజ్ ఆహారాన్ని ఇష్టపడే వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద సవాల్‌గా మారింది. ధరలు మరికొంత కాలం ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి పెరిగి సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ధరలు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కిలో చికెన్ 300 రూపాయలకు చేరువగా వెళ్లింది.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రూ.300కు కిలో విక్రయిస్తున్నారు.. ఇక, హోల్ సెల్లో కోడి గుడ్ల ధర రూ.6.30 పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి దాని ధర రూ.8.50కు చేరి సామాన్యుల జేబుకు చిల్లు పెడుతుంది..
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..