Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inspiring Success Story: పిల్లల కెరీర్ కోసం.. తమ ఆశలు, ఆశయాలను త్యాగం చేసి.. పిల్లలు బాగుంటే చాలు.. వాళ్లు జీవితంలో సెటిల్ అయితే చాలు అని భావించే పేరెంట్స్ ఎంతో మంది ఉంటారు.. ఇక, కష్టకాలంలో తల్లి చేసిన ఒక త్యాగం.. కూతురి జీవితాన్ని మార్చేసింది. తల్లి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. ఉద్యోగం సాధించి.. ఆ తర్వాత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. బెంగళూరులో ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్న అనుస్మితా మహాపాత్ర తన విజయానికి కారణమైన తల్లి త్యాగాన్ని సోషల్ మీడియాలో పంచుకుని అందరి మనసులను కదిలించింది.
కాలేజీ అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో తన తల్లి ఎలాంటి సందేహం లేకుండా బంగారు గాజులను తాకట్టు పెట్టిందని అనుస్మితా వెల్లడించింది. తన చదువు ఆగిపోకుండా చూడటమే ఆమె లక్ష్యమని తెలిపింది. అయితే, ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం సంపాదించడం తనకు కేవలం ఒక ఉద్యోగం కాదని, అది తల్లి చేసిన త్యాగానికి దక్కిన ఫలితమని అనుస్మితా పేర్కొంది. ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లే ప్రతిసారి తల్లి కష్టం గుర్తుకు వస్తుందని, తన విజయం అంతా ఆమెకే అంకితమని భావోద్వేగంగా తెలిపింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇన్స్టాగ్రామ్లో ఆమె పంచుకున్న వీడియోలో తల్లితో గడిపిన మధుర క్షణాలతో పాటు తన ఉద్యోగ జీవితానికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా, తల్లి–కూతుళ్ల అనుబంధాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు. తల్లిదండ్రుల త్యాగం పిల్లల విజయానికి ఎంతటి ప్రేరణగా నిలుస్తుందో ఈ కథ మరోసారి చాటిచెప్పింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!