విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.