ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం మహిళా ఆటగాళ్ల తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా సెమీఫైనల్‌కు చేరనప్పటికీ.. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో చరణి రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మార్పులు..
టాప్-5 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టోర్నీలో 8 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరగా, ఆమె సహచర ప్లేయర్ లారెన్ బెల్ మూడు స్థానాలు ఎగబాకి నాల్గో స్థానానికి చేరుకుంది. సౌతాఫ్రికా స్పిన్నర్ నాన్కులులేకో మ్లాబా (5వ స్థానం), పాకిస్థాన్ సీనియర్ బౌలర్ నష్రా సంధు (9వ స్థానం) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. మారిజానే కాప్ (14వ స్థానం), బ్రీ ఇల్లింగ్ (31వ స్థానం) కూడా పైకి ఎగబాకారు.
Also Read
బ్యాటింగ్ ర్యాంకింగ్స్..
బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వోల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెత్ మూనీ రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ మూడో స్థానానికి చేరుకుంది. ఐర్లాండ్‌పై సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఏడో స్థానానికి, ఇంగ్లాండ్ ఓపెనర్ డ్యానీ వ్యాట్ హాడ్జ్ 11వ స్థానానికి చేరుకున్నారు. భారత్‌పై హాఫ్ సెంచరీ (56) చేసిన ఆసీస్ సీనియర్ ప్లేయర్ ఎల్సి పెర్రీ ఐదు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకుంది.
ఆల్‌రౌండర్స్ జాబితా..
వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండర్ల జాబితాలో నెం.1 స్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ ప్లేయర్ అమేలియా కెర్ రెండో స్థానంలో ఉంది. ఐర్లాండ్ స్టార్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది. మారిజానే కాప్ (8వ స్థానం), అన్నాబెల్ సదర్లాండ్ (17వ స్థానం) కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.
కాగా.. మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు అర్హత సాధించాయి. లండన్‌లోని కేన్నింగ్టన్ ఓవల్‌లో మంగళవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!