IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
- ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్
- తొలి టీ20లో మార్పులతో బరిలోకి భారత్
- ఇంగ్లండ్ సిరీస్‌లో వైభవ్ అరంగేట్రం
- ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Predicted Playing XI for England T20I: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాలు చూసి పరువు మొత్తం పోగొట్టుకున్న భారత్.. ఇంగ్లండ్‌తో కీలక టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఐర్లాండ్‌పై అపజయాలను మరిచి.. ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగే తొలి టీ20లో భారత్ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్.. ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైనప్పటికీ ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయినట్లు సమాచారం.
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ నిరాశపరిచాడు. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతనిపై మరోసారి విశ్వాసం ఉంచిందట. ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో కూడా సంజుకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో రాణించి విమర్శలకు సమాధానం చెప్పాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ కొత్త ఓపెనింగ్ జోడితో బరిలోకి దిగనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడనునట్లు తెలుస్తోంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కీపర్ సంజు శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆల్రౌండర్లుగా శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేగం, స్పిన్ సమతుల్యతతో భారత జట్టు కూర్పును సిద్ధం చేసింది. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన సూర్యాన్ష్ షెడ్గే తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు.
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో భారత తుది జట్టు:
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
సంజు శాంసన్ (కీపర్)
శివమ్ దూబే
అక్షర్ పటేల్
హర్షిత్ రాణా
ప్రిన్స్ యాదవ్
అర్ష్‌దీప్ సింగ్
రవి బిష్ణోయ్
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!