Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్‌రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Missing Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉదయం నుంచి విస్తృతంగా విచారణ కొనసాగిస్తోంది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దర్యాప్తులో భాగంగా నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావును విచారణ అధికారి ఏసీపీ దైవప్రసాద్ పిలిపించి వివరాలు సేకరించారు. నందిగామలో జరిగిన నవీన్‌రెడ్డి హత్య కేసు, సాయికృష్ణ అదృశ్యం మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది.
మే 23, 24 తేదీలపై ప్రత్యేక దృష్టి
సాయికృష్ణ కేసు ప్రస్తుతం మే 23, 24 తేదీల చుట్టూనే తిరుగుతోంది. మే 23 రాత్రి విజయవాడ బస్టాండ్ డిపార్చర్ బ్లాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభించిన ఘటనను పోలీసులు కీలకంగా పరిగణిస్తున్నారు. అదే మృతదేహాన్ని రాత్రి 8 గంటల సమయంలో స్వర్గపురి స్మశానవాటికకు తరలించిన అంశంపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే, గుర్తుతెలియని మృతదేహం గురించి కృష్ణలంక పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి పంపిన అధికారిక లేఖ, దానిపై హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు ఇచ్చిన ధృవీకరణ పత్రాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పత్రాల్లోని వివరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
మరికొంతమందికి నోటీసులు
ఇక, ఈ కేసులో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో ఇన్చార్జిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తూ సాయికృష్ణ ఆచూకీపై స్పష్టతకు రావాలని దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది. కాగా, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. తనను కలిసిన సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.. ఆ తర్వాత ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు మరింత వేగం పుంజుకున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!