ఐపీఎల్ ఎఫెక్టో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ, వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్‌ను సెన్సేషనల్ నిర్మాత సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ ఫస్ట్ టైం జోడీ కడుతుండగా తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు.
Also Read : Disha Patani : దిశా పటాని అందాల ఆరబోత
కానీ ఈ సినిమాను ఇపుడు మే9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. వచ్చే నెల 10నే సన్నీడియోల్ భారీ బడ్జెట్ చిత్రం జాట్ రిలీజ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటరవుతున్నాయి. కాగా, ఇప్పుడు జాట్ మూవీ కోసమే భూల్ చుక్ మాఫ్ పోస్ట్ పోన్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నతొలి బాలీవుడ్ సినిమా జాట్. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు సన్నీ డియోల్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులోను ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న జాట్ కు పోటీగా రావడం రిస్క్ అని భావించి చాలా సినిమాలు సైడ్ అవుతున్నాయని టాక్ ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది.