CM Chandrababu: బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు.. ప్రత్యక్షంగా వీక్షించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చ. ఏపీలో వరద పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు.. వరదలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి చౌహాన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి చౌహన్ ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి చూశారని తెలిపారు.. ఇక, కృష్ణానదీ పరివాహక ప్రాంతమంతా వర్షాలు పడ్డాయి. బుడమేరు పొంగింది.. అందుకే విజయవాడ ఇంతటి ప్రళయాన్ని చూసిందన్నారు..
Read Also: CV Ananda: పోలీసులపై బెంగాల్ గవర్నర్ తీవ్ర విమర్శలు.. నేరస్థులున్నారని వ్యాఖ్య
అయితే, బుడమేరు వాగు ఆధునికీకరణ కోసం పనులు ప్రారంభిస్తే.. 2019లో క్యాన్సిల్ చేశారని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.. 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టపరచాలని వెల్లడించారు.. కృష్ణా నదీ కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు సీఎం చంద్రబాబు.. కాగా, ఏపీకి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని అని అభినందించారు.. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు.. ప్రకాశం బ్యారేజ్ 70 ఏళ్ల పురాతనమైంది. మరింత వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టపరుస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేసిన విషయం విదితమే. ఇక, వరదలకు కారణం మానవ తప్పిదం కూడా అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..