Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.. కానీ,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.. 2018లో 42.55 కిలోమీటర్ల పొడవుతో 8,300 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో “లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు” కోసం మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయన్నారు.. “పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్” (పీపీపీ) విధానంలో “కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్” ఆర్థిక సహాయానికి కేంద్రం ప్రయత్నించింది. కానీ, “కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్” ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఆర్థిక సహాయానికి నిరాకరించిందని.. పట్టణ రవాణా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశంగా తేల్చేశారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ విదేశీ ప్రయాణాల ఖర్చెంతో తెలుసా?
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ఇక, మెట్రో రైల్ ప్రాజెక్టులు, సమగ్ర రవాణా ప్రణాళికలు, ప్రత్యామ్నాయ విశ్లేషణ నివేదికలు, డీపీఆర్‌ల రూపకల్పన పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుందన్నారు కేంద్ర మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి వనరుల లభ్యతను బట్టి వీలైనంత మేరకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం పరిశీలిస్తుందననారు.. విశాఖపట్నంతో పాటు ఏపీలోని మరో 9 నగరాలు (ఏలూరు, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు)కు “కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్” రూపకల్పనకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు.. అలాగే, విజయవాడ మెట్రో రైల్ కోసం “నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంటిగ్రేషన్ ప్లాన్”, “ఇంటిగ్రేడెట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లాన్” రూపకల్పనకు 2018-19లో కేంద్రం 78.44 లక్షల రూపాయలు ఇచ్చిందని పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!