విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా.. కీలకమైన అలైన్‌మెంట్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫస్ట్ ఫేజ్ కింద 46.63కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుండగా ఇందులో 20కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసియాలోనే పొడవైన ఎలివేటెడ్ మెట్రోగా గుర్తింపు లభిస్తుంది.
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై శాససనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడించారు..
Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.. 2018లో 42.55…