విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభించగా.. కీలకమైన అలైన్‌మెంట్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫస్ట్ ఫేజ్ కింద 46.63కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరగనుండగా ఇందులో 20కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసియాలోనే పొడవైన ఎలివేటెడ్ మెట్రోగా గుర్తింపు లభిస్తుంది.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి.
Vizag Metro Rail: వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు.. 2018లో 42.55…
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ శాఖ పరిధిలోని వివిధ కార్యక్రమాల్ని సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని.. గుంతలు లేని రోడ్లు కనిపించాలని సూచించారు. రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లేఅవుట్ ఉండేలా…