OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఏపీ మంత్రి సీటుకు సెగలు గట్టిగానే తగులుతున్నాయా? విపక్షంతో పాటు స్వపక్ష ఎమ్మెల్యే కూడా ఆయన్ని గట్టిగా టార్గెట్ చేశారా? మంత్రి కుటుంబం మీద వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపల్లో నిజమెంత? అందుకు మినిస్టర్ కౌంటర్ ఏంటి? మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ లీగలా? ఇల్లీగలా? ఎవరాయన? ఏంటా కథ? ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి గెలిచి… బీసీ కోటాలో ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు కొలుసు పార్థసారధి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే మంత్రి పదవి దక్కింది ఆయనకు. గతంలో మూడుసార్లు పెనమలూరు నుంచి బరిలోకి దిగిన సారధి గత ఎన్నికల టైంలో పార్టీ, నియోజకవర్గం రెండూ మారిపోయారు. అయితే టీడీపీ తరపున మంత్రి అయ్యాక కూడా… వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి ఆయన పార్టీ పెద్దలకు వివరణ ఇవ్వడంతో పాటు టీడీపీ కేడర్‌కు కూడా క్షమాపణ కూడా చెప్పి ఆ వివాదం నుంచి బయటపడ్డారు. ఇక నూజివీడులో అక్రమ మైనింగ్ చేస్తూ గతంలో వైసీపీకి పని చేసిన వారికి సారధి సహకరిస్తున్నారంటూ టిడిపి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలు కూడా పెద్ద దుమారాన్నే రేపాయి. యార్లగడ్డ ఆరోపణలు చేసిన వారిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేయడంతో వ్యవహారం ముదిరింది. ఇక అక్రమ మైనింగ్‌పై నూజివీడు, గన్నవరం టిడిపి నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తిరిగి ఇప్పుడు అదే అక్రమ మైనింగ్ విషయంలో మంత్రి ఇబ్బంది పడుతున్నారట.నూజివీడు నియోజకవర్గం తోటపల్లిలో మంత్రి కుమారుడు నితిన్ కృష్ణ బయో ప్లాంట్ పెట్టేందుకు భూమి కేటాయించింది ప్రభుత్వం. అయితే అందులో కొండ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు.
Also Read
వైసీపీ హయాంలో కూడా ఇక్కడ మైనింగ్ జరిగితే అడ్డుకున్నామని, ఎన్నికల సమయంలో తమకు అండుగా నిలుస్తామని చెప్పిన పార్ధసారధి ఇప్పుడు ఇదే ప్రాంతంలో బయో ప్లాంట్ పేరుతో మైనింగ్ చేయించడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కానీ… ప్లాంట్ ఏర్పాటు కోసం కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నామని చెబుతోంది మంత్రి అనుచరగణం. కంపెనీల ఏర్పాటును అడ్డుకోవడం కోసమే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారన్నది వాళ్ళ వాదన. కానీ… లోకల్ వైసీపీ నాయకులు మాత్రం ఈ వాదనతో ఏ మాత్రం ఏకీభవించడం లేదు. మంత్రి కుమారుడికి కేటాయించిన భూమి ఉన్న ప్రాంతంలో అక్రమంగా కొండలను పిండి చేస్తున్నారని, నిత్యం వందల టిప్పర్లతో ఇక్కడ నుంచి గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి స్థానిక వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కలెక్టర్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఆందోళన చేస్తున్న వారితో కలిసి పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంత్రిని గట్టిగా ఇరుకున పెట్టే ప్లాన్‌లో ఉన్నారు వైసీపీ లీడర్స్. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలను మంత్రి కొంతమంది అనుచరులకి అప్పగించారని, వాళ్లే ఇష్టారీతిన మైనింగ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే… ఈ ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకే పరిమితం కాకుండా ఇందులోకి అధికార పార్టీ నేతలు కూడా ఎంటరవడం ఆసక్తి రేపుతోంది. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని మైనింగ్ ఏరియా నుంచి వందల లారీలు నిత్యం గన్నవరం మీదగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గన్నవరం, ఆగిరిపల్లి సరిహద్దు గ్రామంగా ఉన్న గొల్లనపాలెంలో అర్ధరాత్రి వేళ టిడిపి నేతలు టిప్పర్లనుఅట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిత్యం హెవీ లోడ్‌తో వందల లారీలు రాకపోకలు సాగించడంతో గొల్లనపల్లి గ్రామ రహదారులు దెబ్బతింటున్నాయన్నది స్థానికుల ఆవేదన. అలాగే ఈ అర్ధరాత్రి రాకపోకలతో ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోతున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. అయితే…సారధి గన్నవరంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ గతంలో ఆరోపించారు లోకల్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అప్పటినుంచి మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిందన్నది లోకల్ టాక్. మళ్లీ ఇప్పుడు అదే మంత్రి కుమారుడి మైనింగ్ సైట్ నుంచి పెద్ద ఎత్తున లారీలు తన నియోజకవర్గం మీదుగా వెళ్తుండటంతో ఆయన డైరెక్షన్లోనే గొల్లనపల్లి గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అటు ప్రతిపక్షం, ఇటు సొంత పక్షం నుంచి వస్తున్న ఆరోపణలు, వత్తిళ్లలతో మంత్రి సారధి ఇంటా బయటా ఇబ్బందులు పడుతున్నారన్నది ఉమ్మడి కృష్ణా పొలిటికల్ వాయిస్.
- Tags
- NTV Telugu
- Nuzividu
- OTR
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!