పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసకుంది. కొడుకు మరణాన్ని తాళలేక అమ్మ, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. భీమవరంకు చెందిన కార్తీక అనే యువకుడు విజయవాడలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.
కార్తీక్ అమ్మ ఇందిర (50), అమ్మమ్మ కుమారి (75) లు కార్తీక్ లేడని మనస్థాపానికి గురై ఈ రోజు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.