Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్‌కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్‌లో మాట్లాడింది.…
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. అంగవైకల్యం ఆ ఎనిమిదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. ఆ బాలుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకుందామని భార్యపై బాలుడి తండ్రి ఒత్తిడి తెచ్చాడు
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసకుంది. కొడుకు మరణాన్ని తాళలేక అమ్మ, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. భీమవరంకు చెందిన కార్తీక అనే యువకుడు విజయవాడలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. కార్తీక్ అమ్మ ఇందిర (50), అమ్మమ్మ కుమారి (75) లు కార్తీక్ లేడని మనస్థాపానికి గురై ఈ రోజు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు…