టీటీడీ పాలకమండలి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీకి సంబంధించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీకి సంబంధించి 960 ఆస్తులు వుండగా…వాటి విలువ 85700 కోట్ల రూపాయలని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్దాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. 95 కోట్లతో రూపాయల వ్యయంతో యాత్రికులు వసతి సముదాయం 5 నిర్మాణం జరుగుతాయి.
Read Also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
30 కోట్ల రూపాయల వ్యయంతో చేర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడతాం అన్నారు. 2.45 కోట్ల రూపాయల వ్యయంతో నందకం అతిధి గృహంలో పర్నిచర్ ఏర్పాటు చేస్తాం. 7.2 కోట్ల రూపాయల వ్యయంతో కాటేజీలలో గీజర్లు, ఫర్నిచర్ ఏర్పాటుచేస్తాం. నెల్లూరులో కళ్యాణమండపాల వద్ద 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయం నిర్మాణం చేస్తాం. క్లాస్ 4 ఉద్యోగులు యూనిఫాం కోసం 2.5 కోట్లు కేటాయించాం అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 6.3 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్వీ ఆర్ట్స్ కాలేజిలో అభివృద్ది పనులు చేపడతామన్నారు.
వడమాలపేట వద్ద భవిష్యత్త్ అవసరాల దృష్యా 130 ఏకరాల ప్రభుత్వ భూమిని 25 కోట్లకు కోనుగోలు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు తరువాత సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలో టోకెన్లు జారీ ప్రకియని తిరిగి ప్రారంభిస్తాం అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులును ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వసతి గదులు కేటాయింపు ప్రకియను తిరుమలలో కాకుండా తిరుపతిలో కేటాయించాలని భావిస్తున్నాం అని చెప్పారు.
Read Also: TTD: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ప్రైవేట్ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు