విజయవాడలో సీపీఎం దేశ రక్షణ భేరీ సభ జరుగుతోంది. ఈ సభలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కీలక ఉపన్యాసం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి నేటి వరకు రక్షణ భేరి సభలు నిర్వహిస్తున్నాం అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. రాజ్యాంగానికి మోదీ తూట్లు పొడుస్తున్నారు. 8 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఎక్కువైపోయింది.11 లక్షల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారికి మాఫీ చేసారన్నారు.
బ్యాంకులకు రుణాలు ఎగ్గిట్టిన వారంతా మోదీ స్నేహితులే. 330 స్థానంలో వున్న అధాని, మోదీ పాలనలో 3 వ స్థానానికి వెళ్ళాడు. కుభేరులు అంతా గుజరాతీయులే.రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రజలకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. లౌకికవాదన్ని నిర్వీర్యం చేస్తుంది బిజెపి. ఆ పార్టీలోకి రాకుంటే వారిపై ఈడి దాడులు చేస్తున్నారు. డబ్బు ఎర చూపి ఓడిపోయిన రాష్ట్రల్లో మరోసారి బిజేపి అధికారంలోకి వస్తుంది…బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బిజేపికి ఆయుధాలు ఈడి, సీబీఐ. భారతదేశాన్ని కాపాడాలంటే బిజేపిను ఓడించాలి. పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు మా ప్రభుత్వం వస్తే ఏపికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సారాలు అన్నారు. ప్రత్యేక హోదా పై బీజేపి మాట మార్చిందన్నారు. ఎర్ర జెండాల ఉద్యమం వల్లే దేశంలో అభివృద్ధి జరిగిందన్నారు. మళ్ళీ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. లౌకిక వాదాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే వారితో కలిసి పనిచేద్దాం అన్నారు సీతారాం ఏచూరి. దళితులు,ముస్లింల మీద దాడి జరుగుతుంటే వైసీపీ ప్రభుత్యం ఏమి చేస్తుంది. ప్రజల వైపా కేంద్రం వైపా అనేది వైసీపీ నిర్ణయం తీసుకోవాలి. వైసిపి లౌకిక వాదం వైపా లేక కేంద్రం వైపా? ప్రత్యేక హోదా కోసం వైసీపీ కేంద్రం పై వత్తిడి చెయ్యడంలేదు. కేంద్రం నుండి రావాల్సిన 36 వేల కోట్ల రూపాయలు ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
Read Also: Big Breking: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు..
రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసిపికి పార్లమెంట్లో సంఖ్య బలం వున్న కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారన్నారు. విశాఖ ఉక్కు అమ్మకానికి సిద్ధం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్రంలో ఒక అడ్డగోలు ప్రభుత్వం నడుస్తుంది. చెత్త పన్ను వేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో వేస్తారు. డబ్బు లేకపోతే మోదీ జుట్టు పట్టుకుని రూ.36 వేల కోట్లు తీసుకురండి. రాష్ట్రంలో మోదీ రాజ్యం నడుస్తుంది. కేంద్రంలో బిజెపి అదేశాలు…. ఇక్కడ జగన్ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధానిప్రదేశ్ గా మార్చుతున్నారు. కౌలు రైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ రెండు సంవత్సరాల్లో అయిన జగన్ ప్రభుత్వంలో మార్పు రాకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. కమ్యూనిస్ట్ ల కాలం చెల్లింది అనే వారి కాలం చెల్లుతుంది. దేశంలో కేరళ మాత్రమే రైతులకు న్యాయం చేస్తుంది. వికేంద్రీకరణ అనేది కేరళ వెళ్ళి నేర్చుకోండి.. మోదీ అంటే జగన్ కు భయం… అందుకే మోదీ ఏం చేసిన అడగడన్నారు శ్రీనివాస్.
Read Also: Ponniyin Selvan: టాలీవుడ్ ప్రముఖులూ మారండయా… మారండి…!