శంభో శంకరా.. కాపాడవయ్య అంటూ భక్తులు శివ నామ స్మరణ చేస్తూ భక్తులు శివాలయాలకు వెళ్తుంటారు.. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో అపచారం జరిగింది.. విషయానికొస్తే.. శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు.. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగినట్లు కన్పించడంతో షాక్ అయ్యాడు.. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు తెలుసుకొని…
Bhadrachalam Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి…
పరమ పవిత్రమయిన మహా శివరాత్రి నాడు శైవాలయాలకు పోటెత్తుతున్నారు భక్తులు. శివుడికి అభిషేకం చేసి జాగరణ వుంటే పాపాలు పోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా బలివే శివాలయానికి పెద్ద ఎత్తున కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. రెండు ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒకటి…
నూతన సంవత్సరం 2022 సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయాలకు చెందిన వేదపండితులు ఢిల్లీ వెళ్ళారు. ప్రధాని మోడీని కలిసి ఆయనకు శుభాశీస్సులు అందచేశారు. దేవస్థానాల నుంచి తీసుకెళ్ళిన ప్రసాదాలను ప్రధానికి అందచేశారు. అక్షింతలు వేదపండితులు ఆశీర్వచనాలు, దేవస్థానం తరఫున చిత్రపటాలు అందచేశారు. ప్రధాని మోడీ చేతికి కంకణాలు కట్టి, నుదుటిన తిలకం దిద్దారు వేదపండితులు.