హమ్మయ్య ఛేదించారు.. 19వ మృతదేహం అతడిదే..!
కర్నూలు నగర సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. కాకపోతే మరో మృతదేహానికి సంబంధించిన వివరాలను పోలీసులు చేదించలేకపోయారు. అయితే తాజాగా ఈ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే.. ఈ ఘటనలో తేలని 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ జరిగింది. త్రిమూర్తి హైదరాబాద్ కు వచ్చి రిజర్వేషన్ లేకుండా ఆరంగర్ సర్కిల్ వద్ద బస్సు ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అలా బస్సు ఎక్కిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు మొబైల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ అతను అందుబాటులోకి రాలేదు. దానితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కర్నూలుకు బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత ఆ అంతుచిక్కని 19వ వ్యక్తికి డిఎన్ఏ టెస్ట్ జరిపి అమృతదేహం త్రిమూర్తిదే అని వైద్యులు ధ్రువీకరించారు. దీనితో బస్సు దుర్ఘటనలో మరణించిన మొత్తం 19 మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.
రేపు మద్యం షాపులకు డ్రా.. ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ
తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2,620 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయించే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ లాటరీ ప్రక్రియ రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల ద్వారా నిర్వహించబడనుంది. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు ఆమోదం కూడా అందించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు మొత్తం 95,137 దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తులను లాటరీ విధానంలో పరిశీలించి, సరైన కేటాయింపును నిర్ణయించనున్నారు.
బీఆర్ఎస్ కు తలనొప్పిన మారిన గుర్తులు ఇవేనా..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (నవంబర్ 11) కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. బహుళ అభ్యర్థుల మధ్య ప్రతిష్ఠాత్మక రాజకీయ గుర్తులు గందరగోళానికి కారణం కాకుండా ఉండాలని BRS (భారత రాష్ట్ర సమితి) కోరినప్పటికీ, ‘చపాతి రోలర్’, ‘కెమెరా’, ‘షిప్’ వంటి గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకే కేటాయించబడ్డాయి. ఈ గుర్తులు BRS ‘కారు’ గుర్తుకు పోలి ఉంటాయని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. జూలైలో BRS సీనియర్ నేతలు బి. వినోద్ కుమార్, సోమా భారత్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అభ్యర్ధన చేసి, ఈ గుర్తులను కారు గుర్తుకు సమీపంగా ఉన్నందున వాటిని కేటాయించవద్దని సూచించారు. అవి ఓటర్లలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే, ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ మీడియాకు 58 అభ్యర్థులు, వారి గుర్తుల జాబితాను విడుదల చేశారు.
కీవ్‌పై రష్యా డ్రోన్ల దాడి.. ముగ్గురు మృతి, 29 మందికి గాయాలు..!
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 29 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక మరణించిన వారిలో 19 ఏళ్ల మహిళ, ఆమె 46 ఏళ్ల తల్లి ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా డ్రోన్ల దాడి కారణంగా రాజధానిలోని దెస్నియాన్స్కీ జిల్లాలోని రెండు నివాస భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. అత్యవసర సిబ్బంది 16 అంతస్తుల భవనాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించి, మంటలను ఆర్పారు.
తుర్కియేలో 40 ఏళ్ల పోరాటానికి ముగింపు..
తుర్కియేలో 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి కుర్దిష్ PKK ఆదివారం ముగింపు ప్రకటించింది. టర్కీని 40 ఏళ్లకు పైగా పీడించిన ఈ భయంకరమైన యుద్ధం ఇక ముగిసింది. కుర్దిష్ PKK ఆదివారం తన మొత్తం సైన్యాన్ని, యోధులు, ఆయుధాలు ప్రతిదీ టర్కిష్ నేల నుంసీ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఉపసంహరణ మాత్రమే కాదని, నిరాయుధీకరణ వైపు ఒక ప్రధాన అడుగుగా ఈ ప్రకటనలో పేర్కొంది. ఉత్తర ఇరాక్‌లోని ఖాండిల్ పర్వతాల నుంచి విడుదల చేసిన ఈ ప్రకటనలో PKK “స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య, సోదర జీవితానికి పునాది వేయడానికి టర్కీ నుంచి మా అన్ని దళాలను ఉపసంహరించుకుంటున్నాము” అని పేర్కొంది. ఈ ప్రకటన టర్కీకి ఒక వేడుక కంటే తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచమంతా “కౌ-బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్’పై దృష్టి
గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని చెప్పారు. ఇది సైన్స్ అంగీకరించిన వాస్తవాలని తెలిపారు. ఇస్లాంలోనూ కొందరు మతపెద్దలు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసిన ద్రుశ్యాలను తాను చూశానని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని నారాయణగూడ కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణ గో సేవా విభాగం ఆధ్వర్యంలో ‘‘గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఝానం’’పై ఆదివారం రాష్ట్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. విజేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బహుమతులు ప్రదానం చేశారు.
‘మెంథా’ తుఫాను ప్రభావం.. పాఠశాలలకు సెలవులు.. ఏ జిల్లాలో ఎన్ని రోజులంటే..!
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంథా’ తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుపాను తీవ్రత, వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. అలాగే కృష్ణా, బాపట్ల, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్టోబర్ 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇక తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీలలో రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో పాఠశాలలు మూసివేయనున్నారు. ఇక పల్నాడు జిల్లాలో కేవలం అక్టోబర్ 27న ఒక రోజు మాత్రమే సెలవు ప్రకటించారు.
అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వి యాదవ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఆయన ముస్లింలు అధికంగా నివసించే కతిహార్, కిషన్‌గంజ్ ప్రాంతాలలో జరిగిన బహిరంగ సభలలో మాట్లాడుతూ.. ఒక ప్రధాన రాజకీయ ప్రకటన చేశారు. బీహార్‌లో అఖిల భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని చెప్పారు.
ఎవరి గుబ గుయ్యిమంటుందో హరీష్ రావుకి తొందరలోనే తెలుస్తుంది
మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎవరి గుబ గుయ్యిమంటుందో హరీష్ రావుకి తొందరలోనే తెలుసుకుందేమో. లక్ష ఇల్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? హరీష్ రావే చెప్పాలి” అని అన్నారు. అధికారం చేతిలో ఉండగా, ఇష్టానుసారంగా నాళాలను చెరువులుగా మార్చి, కబ్జాలు చేశారు అని ఆయన విమర్శించారు. చిన్న వానే పడితే హైదరాబాద్‌లో సరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, దానికి కారణం ఎవరు అనేది హరీష్ రావు వివరించాలన్నారు. ఉపఎన్నికలు హరీష్ రావు కోసం ట్రబుల్ షూటర్ రోల్ మాత్రమే అవుతున్నాయని చామల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఎంత డబ్బు పెట్టారో ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్‌లో కూడా అదే చేయాలని అనుకుంటే, ఆ నాటకాలు జరగవని స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ పేరుకి మించిన ప్రాముఖ్యత వల్ల, బీఆర్‌ఎస్ ఇంకా గెలవనిదని తెలిసిపోయిందని, ఎవరు గూండాలు, ఎవరు డబ్బులతో గెలవాలని చూస్తున్నారో ప్రజలు 11వ తారీఖున తేలుస్తారని ఆయన చెప్పారు.