సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..
ఈ ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ యూనిట్ తయారీలో స్ప్రే డ్రయర్ పేలడంతో దుర్ఘటన జరిగింది. సిగాచీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రయర్ శుభ్రం చేయకపోవడం, అధిక ఒత్తిడి కారణంగా స్ప్రే డ్రయర్ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు నిపుణులు. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో సిగాచి కంపెనీ సీఈఓ అమిత్ రాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అమిత్ రాజ్ సిన్హాని నిన్న రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పటాన్ చెరు పోలీసులు. అమిత్ రాజ్ సిన్హాని సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. పేలుడు ధాటికి 54 మంది మృతి, అందులో 8 మంది ఆచూకీ గల్లంతు, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన 6 నెలలకు సిగాచి యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. సిగాచి పరిశ్రమలో పేలుడు కేసులో అమిత్ రాజ్ సిన్హా A2గా ఉన్నారు.
వసూళ్లలో “కల్కి” రికార్డు బద్దలు గొట్టిన ధురంధర్.. నెక్ట్స్ టార్గెట్ పుష్ప-2..
ణ్‌వీర్ సింగ్ నటించిన “ధురంధర్” బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. నాలుగో వారాలను చేరుకున్నప్పటికీ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగో శనివారం రోజున ఈ చిత్రం రూ.20.9 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్ రూ.706.40 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, విడుదలైన కేవలం 23 రోజుల్లోనే ధురంధర్ రూ.1,026 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటేసింది. ఇది సినిమా కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. శనివారం రోజు హిందీ వెర్షన్‌కు మొత్తం ఆక్యుపెన్సీ 38.48 శాతంగా నమోదైంది. ఉదయం షోలలో 20.54 శాతం, సాయంత్రం, రాత్రి షోలలో వరుసగా 45.34 శాతం, 42.27 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ స్థిరమైన విజయంతో ధురంధర్ ఇప్పటికే ప్రభాస్ నటించిన “కల్కి 2898 ఏడీ”ని భారత బాక్సాఫీస్ వద్ద దాటేసింది. కల్కి సినిమా భారత్‌లో తన ప్రస్థానాన్ని రూ.646.31 కోట్ల వద్ద ముగించింది. ఇక ధురంధర్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” కలెక్షన్లకు దగ్గర అవుతోంది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,055 కోట్ల వసూళ్లు సాధించింది. అదేవిధంగా, హిందీ వెర్షన్‌లో ప్రస్తుతం రూ.812.14 కోట్ల కలెక్షన్ ఉన్న “పుష్ప 2” రికార్డును కూడా అధిగమించే దిశగా ధురంధర్ దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. “కాంతారా: చాప్టర్ 1”, “ఛావా” వంటి భారీ చిత్రాలను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. కార్తిక్ ఆర్యన్ నటించిన క్రిస్మస్ రిలీజ్ “తూ మేరా మైన్ తేరీ మైన్ తేరా తూ మేరీ” నుంచి పోటీ ఉన్నప్పటికీ, ధురంధర్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీకి రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. నంది నగర్ నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు రానున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎర్రవల్లి నివాసం నుంచి నంది నగర్ కు కేసీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటి సారి గవర్నర్ ప్రసంగానికి , రెండవ సారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చారు.
బీహార్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో వంతెన పైనుంచి బోగీలు కిందపడిపోయాయి. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన అనంతరం రైలు ఇంజిన్ సుమారు 400 మీటర్లు ముందుకు వెళ్లి ఆగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. సిములతాలా వంతెనపై సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో వంతెనపై నుంచి కిందకు మొత్తం 19 బోగీలు పడిపోయాయి. టెల్వాబజార్ హాల్ట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసన్‌సోల్ నుంచి సీతామఢీకి వెళ్తున్న గూడ్స్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పిన అనంతరం రైలు ఇంజిన్ సుమారు 400 మీటర్లు ముందుకు వెళ్లి ఆగింది. ప్రమాద సమయంలో లోకో పైలట్ మరియు గార్డు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
‘క్యాబ్’ ఎక్కుతారా.. ‘కోర్టు’ మెట్లెక్కుతారా?.. మందుబాబులకు పోలీసుల నయా ‘క్లాస్’
వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన మూడు వేర్వేరు ట్వీట్లు ఇప్పుడు మందుబాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ‘లాయర్’ను వెతకడం కంటే.. గూగుల్‌లో ‘క్యాబ్’ను వెతకడం మిన్న! అంటూ.. సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ‘‘ఆపరేషన్ సిందూర్‘‘.. ఆ దేశ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భయపడిందో, ఎలా దెబ్బతిందనే సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. సాక్ష్యాత్తు ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో భయానక వాతావరణం ఉందని జర్దారీ అంగీకరించారు. భారత దాడుల సమయంలో భద్రత కోసం బంకర్‌లోకి వెళ్లాలని తన సైనిక కార్యదర్శి తనకు సలహా ఇచ్చారని అన్నారు.
రజనీకాంత్‌తో ఆ సినిమా తీయాలి: సుధా కొంగర
తన ప్రతిభతో భాషా సరిహద్దులను చెరిపేసి అభిమానులను సొంతం చేసుకున్న దర్శకురాలు సుధా కొంగర. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలు మంచి విజయాన్ని సాధించి, ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆమె ‘పరాశక్తి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమా 2026 జనవరి 10న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాలన్నది డ్రీమ్ అని చెప్పారు. ‘‘నాకు లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం. పూర్తిస్థాయి ప్రేమకథను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది రజనీకాంత్ సర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికే నా వద్ద కథ కూడా ఉంది. దాన్ని డెవలప్ చేయాలి’’ అని అన్నారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయా అందుకే త్వరగానే రిటైర్ కావాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ఉస్మాన్ హాది హంతకులు భారత్ పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు..
బంగ్లాదేశ్‌కు చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకుడు, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య ఆ దేశంలో హింసకు కారణమైంది. భారత్‌పై ఆరోపణలు నెడుతూ, అక్కడి మతోన్మాద మూక ఇండియన్ ఎంబసీపై కూడా దాడులకు పాల్పడింది. దైవదూషన ఆరోపణలపై అక్కడి మైనారిటీ హిందువులను హత్య చేసింది. ఇదిలా ఉంటే, హాది హత్యకేసులో ఇద్దరు ప్రధాన అనుమానితులు హత్య తర్వాత మేఘాలయ సరిహద్దు ద్వారా భారత్ పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
కాటేదాన్‌లో భారీ అగ్ని ప్రమాదం..
రంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన కాటేదాన్‌లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాటేదాన్ టాటా నగర్ పరిధిలోని ఒక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ప్లాస్టిక్ నిల్వలకు మంటలు అంటుకోవడంతో అవి క్షణాల్లోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. ప్లాస్టిక్ వస్తువులు కాలుతుండటంతో ఆ ప్రాంతమంతా కిలోమీటర్ల మేర దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది, దీంతో స్థానిక కాలనీల ప్రజలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ రోజు ఆదివారం కావడంతో పరిశ్రమకు సెలవు ప్రకటించారు, ఫలితంగా కార్మికులు ఎవరూ విధుల్లో లేరు. ఒకవేళ సాధారణ పనిదినం అయ్యి ఉంటే భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి , పోలీసులకు సమాచారం అందించారు.
చరిత్ర సృష్టించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్‌లో జలాంతర్గామిలో ప్రయాణించారు. కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ అయిన INS వాఘషీర్‌లో రాష్ట్రపతితో పాటు నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా ప్రయాణించారు. జలాంతర్గామిలో సముద్రంలోకి వెళ్లిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అంతకుముందు, ఫిబ్రవరి 2006లో జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం నిలిచారు.