తిరుమలలో వైకుంఠద్వారా దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ కొనసాగుతోంది.. తిరుమల, తిరుపతిలో విచారణ సాగుతోంది.. అయితే, రేపు మరోసారి విచారణకు హాజరు కావాలంటూ అధికారులకు నోటీసులు జారీ చేసింది తొక్కిసలాట ఘటమపై ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్.
వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ తొలిదశ ముగిసింది.. నిన్న న్యాయ విచారణ కమిషన్ ముందు కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడో రోజు హాజరయ్యారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.. పద్మావతి పార్కులో ఎంత మంది భక్తులు వేచిఉండే అవకాశం ఉంది.. లోపలికి ఎంతమందిని పంపారని కలెక్టర్ వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణ జరగనుంది...
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమన్నారు నెహ్రూ. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెల్లించే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.. సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తితో 30 రోజుల్లో విచారణ జరపాలని కోరారు పిటిషనర్.. ఇక, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డి..
తిరుపతి ఘటన బాధాకరమని మంత్రి సవిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "తిరుపతి ఘటనలో కుట్రపూరితంగా చేశారని అంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కావాలని చేశారని అంటున్నారు. క్లారిటీ వచ్చాక ఈ విషయాలపై మాట్లాడతాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు.
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని…
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని..…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి.