అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ బాగా సక్సెస్ అయిందని మంత్రి పార్థపారధి అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘అనంతపురం సభకు ప్రజలు ఊహించని దాని కన్నా ఎక్కువ మంది వచ్చారని.. ఇది చూడలేకే జగన్ తన బాధ వెళ్లగక్కుతున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తన భర్త బాగానే ఉన్నాడని.. ఆ తర్వాతే ఏదో జరిగిందని సింగయ్య భార్య లూర్ద్ మేరీ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్.జగన్‌ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.
తిరుపతి తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా రుయా ఆస్పత్రి నుంచి 8 మందిని స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం స్విమ్స్ ఆస్పత్రిలో 16 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. 32 మంది భక్తులు డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా… ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.