ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. మరోవైపు.. విజన్ 2047ను ప్రవేశపెట్టాను.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇవాళ నారావారిపల్లెలో బిజీబిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకోనుంది. ఆ తర్వాత సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం.. బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహావిష్కరించనున్నారు చంద్రబాబు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు మంచి అవకాశం.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. నారావారిపల్లెలో మెగా జాబ్ మేళా జరగబోతోంది. భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 3వ తేదీన నారావారిపల్లెలో 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా జరుగనుంది.
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూసారు. నేడు స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తండ్రిని కోల్పోయిన నారా రోహిత్ ఇన్నేళ్ళుగా తండ్రి రామ్మూర్తి నాయుడుతో తనకున్న ప్రేమ, ఆప్యాయతను తలచుకుంటూ నారా రోహిత్ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్టు చేసారు. నారా రోహిత్ ఎక్స్ ఖాతాలో ‘ నాన్నా మీరొక ఫైటర్.. మా కోసం ఎన్నో త్యాగాలు…
Balakrishna: చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట సంక్రాంతి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే పాడిరైతులతో కలిసి దేవాన్ష్ పాలు పితుకుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా భోగీ పండగ రోజు ఉదయాన్నే హీరో…
Sankranti Festival: ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు…