తిరుపతి రాయల చెరువు ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయం పై ఎన్టీవీతో స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ… రాయల్ చెరువు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాత్రి దేవుడు దయతో భయటపడాలీ అని కోరుకుంటున్నాం. మా ప్రయత్నాలు మేము వంద శాతం గండి పూడ్చానికి చేస్తాం. 0.9 టి.ఎం.సి నీళ్ళు రాయల్ చెరువులో ప్రస్తుతం వున్నాయి. గతంలో ఇంత కెపాసిటీ నీళ్ళు గతంలో ఏ చెరువుకు రాలేదు. కాబట్టి సమీపంలోని 20, గ్రామాల ప్రజలు ఎవరు ఇళ్ళలో ఉండకండి. రెండు అంతస్తుల భవనంలో కూడా ఎవరు ఉండకండి. పరిస్థితులు బాగాలేదు… కాబట్టి ముందుగానే ప్రజలను అప్రస్తుతం చేస్తున్నాం.. ప్రజలు తప్పనిసరి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ఇరిగేషన్ అధికారులు పరిశీలించి చర్యలు చేపడుతున్నారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో వున్నాయి అని పేర్కొన్నారు.