Pawan Kalyan: ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కీలక విషయాలను తాజాగా మాట్లాడారు. తిరుమల దేవస్థానం కేవలం యాత్ర స్థలం మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొన్నారు. తిరుమల యాత్ర అనేది “భక్తి దైవానుగ్రహాన్ని కలుసుకునే స్థలం” అని పవన్ అన్నారు. అలాగే “తిరుమల లడ్డూ కేవలం స్వీట్ కాదు.. అది భక్తుల విశ్వాసానికి ప్రతీక” అని అన్నారు. భక్తులు ఈ ప్రసాదాన్ని కుటుంబ…
దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం.. సంతోషించదగిన విషయం అని అన్నారు. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన, డ్యాన్సులతో ట్రెండ్ క్రియేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ మంతా ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్‌కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు..
ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు.
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీ వివాదంతో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధిస్తున్నట్లు తెలిపారు.