Ambati Rambabu: టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు.. జంతువుల కొవ్వు కలిసిందని గానీ, కల్తీ జరిగిందని గానీ ఎలాంటి ఆధారాలు లేవు.. పరిశుభ్రతకు, తిరుపతి ప్రసాదాలు మారు పేరు అని పేర్కొన్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్.. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది.. ఈ రోజు శ్రీవారి ఆలయంలోని పోటులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది..
తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకురావాలనేది వైయస్సార్ వైసీపీ ఉద్దేశం కాదని.. చంద్రబాబు వివాదమాయం చేయాలని ప్రయత్నించినప్పుడు... ఆయన చెప్పిన అబద్ధాలపై వివరాలను మాత్రమే ఇచ్చామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్‌కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు..
ఇవాళ ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై సిట్ దృష్టిపెట్టనుంది. లడ్డూ పోటులో పనిచేసే సిబ్బందిని ప్రశ్నించి.. లడ్డూ తయారీ నుంచి.. విక్రయాల విక్రయాల వరకు ఉండే ప్రాసెస్‌ను ఇవాళ పరిశీస్తారు.
తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదట నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారు.. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా.. సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు.
సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించింది.. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది.. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి.. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్‌కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
TG Venkatesh: ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరు జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు.