కాకినాడ కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం అక్రమ దందాపై ఏర్పాటు చేసిన సిట్ బృందం లో మరొకసారి మార్పులు చేర్పులు చేశారు... ఇప్పటివరకు ఐదు సార్లు సిట్ టీం ని మార్చింది ప్రభుత్వం.. అసలు రేషన్ మాఫియాపై విచారణ ఎప్పటికీ మొదలవుతుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు .. ఈసారి సిట్ బృందంలోకి సిఐడి ని కూడా ఇన్వాల్వ్ చేశారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్ టీమ్ ముంబై వెళ్లింది.. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)..
Vallabhaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసిన భూ అక్రమాలు, అక్రమ మైనింగ్, ఆర్థిక అరాచకాలపై దర్యాప్తు చేయాలని సిట్ కు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్.. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది.. ఈ రోజు శ్రీవారి ఆలయంలోని పోటులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది..
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై నేడు మరో నివేదికను సిట్ ఇవ్వనుంది. సోమవారం ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ.. కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు.