తూర్పు గోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలను టార్గెట్ చేసి మరీ హుండీలను ఎత్తుకెళుతున్నారు. కోరుకొండలో ప్రసిద్ది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై దొంగలు హల్ చల్ చేశారు. ఆలయంలోని నాలుగు హుండీల చోరీకి పాల్పడ్డారు. గోడకి ఉన్న రెండు డిబ్బిలు.. మరో రెండు స్టీల్ హుండీలు బద్దలు కొట్టి నగదు దొంగిలించుకుపోయారు దుండగులు.
భక్తులు డిబ్బీలలో సమర్పించిన కానుకలు, సొమ్ములు దొంగతనానికి గురవడం పట్ల భక్తులు, గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంతో ప్రసిద్ధమయిన ఆలయంలో సీసీ కెమేరాలు పనిచేయడం లేదు. స్వామి వారి ఆలయానికి భద్రత కరువయిందని భక్తులు మండిపడుతున్నారు. కోరుకొండలో ఇటీవల భారీగా పెరిగిపోయిన దొంగతనాల పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నిద్రావస్థలో పోలీసులు వున్నానరి భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలోని ఆలయం గోపురంలో మంటలు
చెన్నైలోని భద్రకాళీ అమ్మవారి ఆలయ రాజగోపురంలో మంటలు వ్యాపించాయి. మంటల్లో శివకాశిలోని భద్రకాళీ అమ్మవారి ఆలయ రాజగోపురం ఉండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. విరుదునగర్ లోని భద్రకాళీ ఆలయంలో ఉదయం ఒక్కసారి రాజగోపురంలో మంటలు వ్యాపించాయి. దీంతో గోపురం కింద నిద్రిస్తున్న భక్తులు ఒక్కసారిగా ఆందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మంటలు ఎలా వ్యాపించాయనేది విచారణలో తేలుతుందన్నారు పోలీసులు.