Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాభదాయకమైన ఉద్యోగాల పేరుతో థాయ్‌లాండ్ వెళ్లి ఆపై మయన్మార్ సరిహద్దులకేసి సైబర్ స్కామ్ ముఠాల చేతుల్లో చిక్కుకుంటున్న తెలుగు యువకుల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొంతమంది తెలుగు విద్యార్థులు తాము బ్యాంకాక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను బలవంతంగా మయన్మార్ తరలించి సైబర్ నేరాలకు పాల్పడేలా వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆర్తిని వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారిని సురక్షితంగా మాతృభూమికి రప్పిస్తామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హామీ ఇచ్చారు.
ఈ అంతర్జాతీయ ఉపాధి మోసాల ముఠాల నుంచి యువతను రక్షించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ , బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, ఏపీ ఎన్ఆర్టీ సంస్థలతో ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. ఆగ్నేయాసియా దేశాలలోని సైబర్ ముఠాల బారినపడి ఏపీ, తెలంగాణలకు చెందిన పదుల సంఖ్యలో యువకులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, భారత విదేశాంగ శాఖ సాయంతో ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
I understand your distress and concern. I will take up the matter with the concerned authorities to ensure that all necessary assistance is provided for their safe return. @OfficeofNL will coordinate. https://t.co/vShQxru62t
— Lokesh Nara (@naralokesh) August 10, 2026
మోసపూరిత ఏజెంట్ల వలలో పడకుండా ఉండేందుకు APNRTS , ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (OMCAP) ద్వారా హెల్ప్లైన్లను (+91 863-2340678) అందుబాటులోకి తీసుకువచ్చారు. పర్యాటక వీసాలపై ఉద్యోగాలు ఆశించి విదేశాలకు వెళ్లవద్దని, ఉద్యోగ ఆఫర్ల ప్రామాణికతను చెక్ చేసుకున్న తర్వాతే వెళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ, చట్టపరంగా పూర్తి సహాయసహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!