Schools Bandh: ఏపీ, తెలంగాణలో నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వసతి, విద్యాదీవెన బకాయిలు విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, పుస్తకాలు, యూనిఫామ్‌లు ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము పిలుపునిచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలలో పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు బంద్ చేపట్టనున్నారు.
Read Also: Skin Looking Like Plastic: ప్లాస్టిక్‌లా మారిపోయిన ఓ మహిళ చర్మం.. కారణమేమిటో తెలుసా?
మరోవైపు తెలంగాణలో కార్పొరేట్ కాలేజీలను నియంత్రించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇంటర్ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఏబీవీప నాయకులు మండిపడ్డారు.