CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇబ్రహీంపట్నం సెంట్రల్ జీఎస్టీ రేంజ్ కార్యాలయంలో రూ. 50 వేల లంచం తీసుకుంటూ సీజీఎస్టీ సూపరింటెండెంట్ బానోతు మంగమ్మ సీబీఐకి చిక్కారు. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన పన్ను బకాయిల వ్యవహారంలో డిమాండ్ నోటీసు జారీ చేయకుండా, ఆ అంశాన్ని పూర్తిగా ముగించేందుకు ఆమె రూ. 1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అధికారులు ఆగస్టు 10న కేసు నమోదు చేసి, వెంటనే పక్కా వ్యూహంతో ట్రాప్ నిర్వహించారు.
అధికారులు వేసిన వ్యూహం ప్రకారం.. డిమాండ్ చేసిన మొత్తంలో తొలి విడతగా రూ. 50,000 నగదును ఫిర్యాదుదారుడి నుంచి స్వీకరిస్తుండగా సీబీఐ బృందం ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అనంతరం, ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడలోని మంగమ్మ నివాసంతో పాటు ఇతర ప్రాంగణాల్లో సీబీఐ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించిన పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Also Read
- AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
- Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
అరెస్టయిన అధికారిణి బానోతు మంగమ్మను ఆగస్టు 11న విజయవాడలోని సంబంధిత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. సీజీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి లంచం కేసులో దొరికిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, శాఖాపరమైన మరియు చట్టపరమైన తదుపరి చర్యలను వేగవంతం చేశామని సీబీఐ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!