నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ చేతివాటం వెలుగుచూసింది. అచ్చంపేట SBI బ్యాంకులో బ్యాంకు ఉద్యోగి బాగోతం బయటపడింది. చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టిన ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి కిరణ్. బ్యాంకు ఖాతాదారులైన 45 మంది రైతుల సొమ్ము కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. తమ ఖాతాల్లోని డబ్బు మాయం అవడంపై రైతులు బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు.
Also Read:Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !
ఏవో కారణాలు చెప్తూ.. నేడు, రేపు అంటూ తప్పును కప్పిపుచ్చేందుకు బ్యాంకు మేనేజర్ ప్రయత్నం చేశాడు. రైతులు నిలదీయడంతో త్వరలోనే డబ్బులు ఖాతాలో జమ చేస్తానని బ్యాంకు మేనేజర్ హామీ ఇచ్చాడు. రోజులు గడుస్తుండడంతో ఆందోళనకు గురైన ఖాతాదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. రైతుల సొమ్ము కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్న ఉద్యోగి కిరణ్ ను అధికారులు సస్పెండ్ చేశారు.