Srikakulam Stampede: శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. అయితే, కార్తీక మాసం ఏకదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జనసందోహం పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Kakani Govardhan Reddy: నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..?
అయితే, ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు సంఘటన జరిగిన ఆలయానికి చేరుకుని పరిస్థితిని నియంత్రిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు.
అయితే, తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా పండా కుటుంబం పదేళ్ల క్రితం 12 ఎకరాల భూమిలో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈరోజు కార్తీకమాసంలో వచ్చే ఏకదశి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రెయిలింగ్ ఊడిపోయివడంతో కిందపడ్డారు. దీంతో పిల్లలతో సహా తొమ్మిది మంది చనిపోయారు. ఆలయం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.