Sri SathyaSai Dist: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బయలుదేరారు. ఈ క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకునేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. భారీ భద్రత మధ్య మెట్రో రైలులో ప్రధాని మోడీ ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ…
మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో…
తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్నగా నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా రాజకీయ వేదిక అయినా కోట్లాది మంది ప్రజానీకం మనసులో యుగ పురుషుడుగా నిలిచారు నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుండి ఎన్టీర్ శత జయంతి…