ఈరోజు జరిగిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులను డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఐపీఎస్ సమీక్షించారు.
GPS vs CPS: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీపీఎస్ వర్సెస్ జీపీఎస్‌గా మారింది పరిస్థితి.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. జగన్ సర్కారు తీసకున్న ఈ నిర్ణయంపై పెద్ద వివాదమే రాజుకుంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధాం తీసుకొస్తోంది. ఈ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. అయితే పాత పెన్షన్…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. సంక్రాంతిలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఏపీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళన సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్…
సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శాసనమండలిలో సీపీఎస్ రద్దు పై వాయిదా తీర్మానం ఇచ్చారు పీడీఎఫ్ సభ్యులు.. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్ రాజు.. అయితే, ఉపాధ్యాయులపై నమోదు చేసిన కేసులుపై పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని చెప్పటం ధర్మమేనా…? అని ప్రశ్నించారు.. సీపీఎస్ ను రద్దు…
Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే…
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు.…
Botsa Satyanarayana: ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని..…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశం బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కొంత స్పష్టతకు ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సీపీఎస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని జేఏసీలతో జీవోఎమ్ భేటీ కానుంది. జీపీఎస్‌లో మరింత మెరుగైన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలకు వివరించాలనే ఆలోచనలో…