Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
- ఫలించిన స్పీకర్ చొరవ
- పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
- ఆరు గంటల సమయం కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్‌ఫెయిర్ మీన్స్ నివారణ) సవరణ బిల్లు-2026పై నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన చొరవ ఫలించడంతో మంగళవారం నుంచి బిల్లుపై చర్చ ప్రారంభించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం. సోమవారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్‌ఫెయిర్ మీన్స్ నివారణ) సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
బిల్లు ప్రవేశపెట్టే ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. పోటీ పరీక్షల పారదర్శకత, కోట్లాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో నినాదాలకు బదులుగా విస్తృతంగా చర్చ జరపాలని కోరారు. లోక్‌సభ నిబంధనల ప్రకారం బిల్లును ప్రవేశపెట్టే ముందు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ పేర్లను స్పీకర్ ప్రకటించారు. అయితే ఎవరూ మాట్లాడకపోవడంతో జితేంద్ర సింగ్‌కు బిల్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ‘‘నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ బిల్లు ప్రజా పరీక్షల వ్యవస్థను మెరుగుపరిచే తొలి అడుగు. నినాదాలు చేయడం కంటే సభలో చర్చించండి. మీరు సూచించే మార్పులను ప్రభుత్వం పరిశీలించి సాధ్యమైనంత వరకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంది.’’ అని అన్నారు. బిల్లుపై చర్చ కోసం ఆరు గంటల సమయం కేటాయించినట్లు స్పీకర్ తెలిపారు. అవసరమైతే సభ అభిప్రాయం మేరకు మరింత సమయం కూడా ఇవ్వొచ్చని చెప్పారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పరిష్కరించుకునేందుకు మూడు గంటల సమయం కూడా ఇచ్చారు.
జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీనిర్వహించిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!