AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూనే.. కొన్ని షరతులు విధించింది హైకోర్టు.. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, నిర్దిష్ట షరతులతో వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు విధించిన షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
ఏపీ లిక్కర్ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనూ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, కోర్టు ఆదేశాలతో నిందితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.. మరోవైపు, సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. ఏపీ లిక్కర్ కేసులో దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కొట్టివేయాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. ఈ పిటిషన్లో పలు సందేహాలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తం చేయగా.. ఏమైనా సందేహాలుంటే సరైన సమయంలో తమ అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది..
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!