పవిత్రమయిన ఉపాధ్యాయ వృత్తిలో వుండి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది టీచర్లు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో చిల్లగుండ్ల పల్లెలో సైకో ఉపాధ్యాయుడు ఉదంతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెబితే చాక్ పీసు తాళి కట్టేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.
బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో టిచర్ గా పనిచేస్తున్న అబు (58)విద్యార్ధినుల పట్ల పైశాచికంగా ప్రవర్తించి,లైంగికంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు అబు. తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరింపులకు పాల్నడ్డాడు. చాక్ పీసుకు ఓ తాడు ముడివేసి.. ఈ తాళి కట్టేస్తానని భయపెట్టేవాడు అబు. దువ్వెనతో వారి తలలు దువ్వి, పౌడర్ రాసి, బొట్టు బిళ్లలు పెట్టేవాడని చిత్తూరు ఆర్డీవో రేణుక, డీఈవో పురుషోత్తం, ఎంఈవో నాగేశ్వరరావు, తహసీల్దారు సుశీలమ్మ, ఎంపీడీవో విద్యారమ, గ్రామస్తుల సమక్షంలో విలపించారు విద్యార్థులు.
ఘటనపై స్పందించి అబును సస్పెండు చేశారు డీఈవో. అబు మీద పోక్సో కేసు నమోదుచేసి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆర్డీవో ఆదేశాలిచ్చారు. ఆర్డీవో ఆదేశాలతో అబుని అరెస్ట్ చేశారు పోలీసులు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ బహిరంగలేఖ