వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.. అంతేకాదు, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు వైఎస్ జగన్?. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాళ్యం…
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు అనుమతి ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు... అయితే, అనుమతి ఇస్తూనే.. కొన్ని షరతులు పెట్టారు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు జగన్ వెళ్లనుండగా.. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో ఐదువందల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు..
రాబోయే ఐదేళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను…
పవిత్రమయిన ఉపాధ్యాయ వృత్తిలో వుండి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొంతమంది టీచర్లు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో చిల్లగుండ్ల పల్లెలో సైకో ఉపాధ్యాయుడు ఉదంతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చెబితే చాక్ పీసు తాళి కట్టేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో టిచర్ గా పనిచేస్తున్న అబు (58)విద్యార్ధినుల పట్ల పైశాచికంగా ప్రవర్తించి,లైంగికంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు అబు. తల్లిదండ్రులు, ఇతరులెవరికైనా ఈ విషయాన్ని చెబితే టీసీ ఇచ్చి…