Pawan Kalyan: వెంకన్నకి అపచారం జరిగితే.. మాట్లాడకుండా ఎలా ఉంటాం..
- భారతీయుడిగా.. హైందవ ధర్మాన్ని పాటించేవాడిగా మీ ముందుకొచ్చా..
- హిందుత్వాన్ని పాటిస్తా.. అన్ని మతాలను గౌరవిస్తా.. ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది..
- సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను- డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తిరుపతిలో వారహి డిక్లరేషన్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఎప్పుడు రోడ్డు మీదకు రాలేదు.. సంక్షేమం, అభివృద్ధి ఇచ్చి హామీలను నిలబెట్టు కోవడానికి కూటమీ ప్రభుత్వం పని చేసింది.. పగ, ప్రతీకార రాజకీయాలుండవని గెలవగానే చెప్పామన్నారు. పది సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు తిట్టారు.. అనేక రకాలుగా దూషించారు.. అయినా ఎప్పుడు బాధ పడలేదు.. కానీ వేంకటేశ్వర స్వామి మీదకే వస్తే ఎందుకు ఊరుకుంటాం.. అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా అని ఆయన మండిపడ్డారు. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని కోరుకున్నా.. వైసీపీ నేతలే ఈ పరిస్థితిని తీసుకొచ్చారు.. నాకు అన్యాయం జరిగిందని నేు బయటకు రాలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ఇక, కల్తీ ప్రసాదాలు పెట్టారు.. వెంకన్న స్వామికి అపచారం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సనాతన ధర్మానికి అపచారం చేస్తూనే వచ్చారు.. భరించాం.. భగవంతుడు వారిని 11 సీట్లకు కుదించినా బుద్ధిరాలేదు.. సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగానో, జనసేన అధ్యక్షుడిగానో నేను ఇక్కడికి రాలేదు.. భారతీయుడిగా హైందవ ధర్మాన్ని పాటించేవాడిగా మీ ముందుకొచ్చాను.. హిందుత్వాన్ని పాటిస్తా.. ఇస్లాం, సిక్కుయిజం, బుద్దియిజం, క్రిస్టియన్ సహా ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మం అని ఉప ముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.
Read Also: DGP Atul Verma: డీజీపీ సంచలన నిర్ణయం.. తక్కువ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడితే నేరం కాదు!
అలాగే, ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది.. ప్రాయశ్చిత దీక్ష చేపడితే దాన్ని అపహాస్యం చేశారు అని డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వారికి పాపంలా కనిపిస్తోంది.. సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను.. దాని కోసం నా జీవితం, రాజకీయ జీవితం పోయినా బాధపడను.. నేను ఎప్పుడూ ధర్మం తప్పలేదు అని ఆయన చెప్పారు. నా కూతురితో దర్శనానికి వెళుతూ డిక్లరేషన్ ఇప్పించా.. పరాజయం ఎదురైనా, పరాభవం ఎదురైనా ఇలా ఉండటానికి కారణం సనాతన ధర్మమే.. సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని కొందరు అంటున్నారు.. రామాయణం కల్పవృక్షం కాదు.. విషవృక్షం అన్నారు.. కొంతకాలంగా కల్తీనెయ్యి, జంతువు కొవ్వు కలిపిన ప్రసాదాలు స్వామికి పెట్టారు.. కల్తీనెయ్యితో చేసిన లడ్డూలే అయోధ్య రామయ్యకు పంపారు అని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!